మొక్క బతికి బట్టకట్టడమనేది మొక్క నాటే పద్దతి పైనే పూర్తిగా ఆధారపడి ఉంది
సరైన పద్దతిలో నేర్పుగా మొక్కలు నాటగలిగితే 50% మొక్కలని మనం బ్రతికించుకన్నట్లే!

*కేటగిరి ఏదైనా సరైన అలైన్ మెంట్ ప్రకారం గుంతలు తీసారా అనేది సరిచూసుకోవాలి*1

మనం నాటే ప్రదేశాలను/ కేటగిరీని బట్టి మొక్కలను ఎంపిక చేసుకోవాలి అవెన్యూలో పెద్దగా పెరిగే నీడనిచ్చే రకాలు కానుగ వేప చింత గుల్ మొహర్ లాంటివిబెటర్*
కమ్యూనిటీ లో చింత ఉసిరి తంగేడు సీతాఫలం అలాగే హరిత వనాల క్రింద అటవీ భూముల్లో ఫారెస్ట్ స్పెసీస్, ఇన్సిట్యూషన్ల లో మునగ పండ్ల మొక్కలు బెటర్

2 సమకూర్చుకోవాల్సిన మెటీరియల్
అవెన్యూలో ఒకటిన్నర మీటర్ల పొడుగు మిగిలిన కేటగిరీలలో ఒక మీటరు పొడవు గల మొక్కలను తెచ్చుకోవాలి
స్టేకింగ్ కోసం అవెన్యూలో 2 మీ మిగిలిన కేటగిరీలలో సరిపోయినంత
కవరు చింపడానికి బ్లేడ్
పార
నీళ్లు పోయడానికి బకెట్ లేదా బిందె
జనపనార ముక్కలు (సుతిలి)
వెంటనే ఫెన్సింగ్ చేయడానికి జూలీఫ్లోరా ( సర్కార్ తుమ్మ) కట్టడానికి నార తీగలు

3 నర్సరీ నుండిమొక్కలను జాగ్రత్తగా రవాణా చేయాలి వాహనాలలో ఎక్కించేప్పుడు దించేప్పుడూ కవర్ లోని మట్టి కదిలిపోకుండా కూలీలకు చెప్పాలి
మొక్కలు రవాణా చేసే ముందు రోజు వాటర్ పట్కపోవడం మంచిది రవాణా చేసుకున్న తదుపరి మొక్కవు నాటడం ఆలస్యమైతే మాత్రం ప్రతి రోజు వాటరింగ్ చేయాలి
ప్రతీ గుంత దగ్గరకి మొక్కలు చేరవేసుకోవాలి

4 ముఖ్యంగా అవెన్యూలో మాగిన పశువుల పేడ ఎరువుగా వేయాలి దీనికి ఎస్టిమేట్ లో ప్రొవిజన్ కూడా ఇచ్చారు
వేళ్లకు తెగుళ్లు సోకకుండా శిలీంధ్ర నాశిని మందు వేయాలి ముందుగా గుంత తీసినపుడు పైన 5 సెం మీ మట్టిని పక్కగా వేసుకున్నాం కదా ఆమట్టిని గుంతలో మఃదటగా వేయాలి
తర్వాత మట్టి లోని రాళ్లూ రప్పలు పెంకులు పోలీథిన్ కవర్లను ఏరి తీసివేయాలి లేదంటే అవి మొక్క వేర్లను అడ్డుకుంటాయి!
మొక్క తవ్వినపుడు వచ్చిన మట్టిని మొత్తం గుంతలో నింపి వేయాలి

5 మొక్క కవరును చేతితో పట్టుకొని బ్లోడు తో రెండుపక్కలా క్రిందికి యూ U ఆకారంలో గాటుపెట్టాలి కవరు లోని మట్టి విచ్చుకొని పోకుండా కవరు తీసివేయాలి. మొక్కవేర్లను పట్టుకొని మట్టి అలాగే ఉండటం వల్ల మొక్క నాటుకునే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి

6 అపుడు గుంత మధ్యలో చేతితో మట్టిని కాస్త లోతు చేసి మొక్క కవర్ లో ఉన్నపుడు మట్టిలో మునిగిన భాగాన్ని మాత్రమే మట్టితో కప్పాలి
అంతేగానీ మొక్కను గుంతలో పాతినట్లుగా నాటకూడదు దానివల్ల మొక్క వాన నీటిలో మునిగి కుళ్లిపోయే అవకాశం ఉంది
తదుపరి మొక్కచుట్టూ కాస్త ఎక్కువ మట్టి వేసి మొక్కను చేతితో పట్టుకొని మొక్కచుట్టూ తిరుగుతూ కాళ్ల తో అదమాలి

7 మొక్క చుట్టూ అవెన్యూలో 1 మీ వెడల్పు( అర మీటర్ వ్యాసార్ధం ) మిగిలిన కేటగిరీలలో అర మీటరు వెడల్పు తో పాదు (సాసర్) తప్పని సరిగా ఏర్పాటు చేయాలి పాదు నీరు పోసినపుడు కొట్టుకొనిపోకుండా కనీసం 10 సెం మీ మందంతో వేయాలి

సరైన పాదు ఉంటే మొక్క ఖచ్చితంగా బతుకుతుంది పాదు చెడిపోయిన ప్రతీ సారీ సరి చేస్తే మొక్కల సర్వైవల్100% ఉంటుంది
వర్షాలు కురిసినపుడు పాదులో నీళ్లు నిలిచి మొక్క చుట్టూ తేమ పెరిగి మొక్క మనం నీరు పోయని పరిస్థితుల్లో కూడా మొక్క పోషకాలు తీసుకోగలదు అందుకో ప్రతీ FA/ మేట్ సైన కొలతలతో తప్పనిసరిగా పాదులు చేసేలా కూలీలకు చెప్పాలి

8 మొక్క నాటగానే అది షాక్ కు గురై ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నీరు పోయాలి గుట్టల ప్రదేశాల్లో నాటి నప్పటికీ పక్కన మడుగులు కుంటల నుండి నీరు తెచ్చిపోయాలి
ముందురోజు భారీ వర్షం పడి బురదగా ఉంటే తప్ప నీరు పోయాల్సిందే!!